పవన్ కల్యాణ్ కు మరోసారి అస్వస్థత !

Telugu Lo Computer
0


వన్ కల్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. పిఠాపురంలో ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కు జ్వరం రాగా హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు. దీంతో ఎన్నికల ప్రచార కార్యక్రమం వాయిదా పడింది. ఆదివారం గాజువాకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొన్నారు. జనసేన అభ్యర్దిగా కొణతాల, ఎంపీ అభ్యర్దిగా సీఎం రమేష్ కు మద్దతుగా నిలవాలని ప్రజలను అభ్యర్దించారు. ఆ సమయంలోనే పవన్ ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది పడ్డారు. ప్రచార సభ ముగిసిన తరువాత పవన్ బాగా నీరసపడినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో పవన్ తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు. పవన్ అస్వస్థత కారణంగా ఈ రోజు యలమంచిలిలో జరగాల్సిన ప్రచార కార్యక్రమం రద్దయింది. రేపు ఉగాది రోజున పవన్ పిఠాపురంలో ఉండాలని తొలుత నిర్ణయించారు. అదే విధంగా ఈ నెల 9, 10 తేదీల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఉభయ గోదావరి జిల్లాల్లోని అయిదు నియోకవర్గాల్లో ప్రచారానికి ప్లాన్ చేసారు. ఆ తరువాత తెనాలిలో నాదెండ్ల మనోహర్ కు మద్దతుగా ప్రచారానికి పవన్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. అయితే, తిరిగి పవన్ జ్వరం కారణంగా ఈ షెడ్యూల్ లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. అనకాపల్లి సభలో సీఎం జగన్, వైసీపీ అభ్యర్దులను పవన్ టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. తమ కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల సీపీఎస్ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.


Post a Comment

0Comments

Post a Comment (0)