సామాజిక న్యాయం చేయడం నా బాధ్యత !

Telugu Lo Computer
0


సామాజిక న్యాయం చేయడాన్ని బాధ్యతగా తీసుకుంటామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పీ.గన్నవరంలో పవన్ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు కూటమి ప్రచారంలో పాల్గొన్నారు. కాపుల్లో కూడా పేదవారు ఉన్నారని... టీడీపీ హయాంలో కాపుల కోసం ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టామని గుర్తు చేశారు. పీ. గన్నవరం ప్రాంతానికి మౌళిక వసతులు కల్పించే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కొబ్బరి పరిశ్రమ తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. అప్పనపల్లి, కాజీపేట ప్రాంతాలకు వరదల సమస్య ఉందని.. ఆ ప్రాంతంలో వంతెన నిర్మించే బాధ్యత తనదేని చంద్రబాబు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)