భారత్‌లో బ్రిటీష్ హైకమిషనర్‌గా లిండి కామెరాన్ నియమితులయ్యారు. ఈ మాసంలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారని యునైటెడ్ కింగ్‌డమ్ హైకమిషన్ వెల్లడించింది. ఇప్పటి వరకు భారత్‌లో ఆ పదవిలో ఉన్న అలెక్స్ ఈలీస్‌ను బదిలీ చేసినట్లు వెల్లడించింది. లిండి కామెరాన్ యూకేలో నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ముఖ్య కార్యనిర్వహాణాధికారిగా ఆమె ఇప్పటి వరకు విధులు నిర్వహించారని తెలిపింది. అలాగే ఉత్తర ఐర్లాండ్ కార్యాలయంలో డైరెక్టర్ జనరల్‌గా కూడా ఆమె పని చేశారని వివరించింది. ఆమె నియమాకం వల్ల.. భారత్, యూకేల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆకాంక్షించింది. భారత్‌లో హై కమిషనర్‌గా నియమాకం కావడం పట్ల లిండి కామెరాన్ ఎక్స్ వేదిగాక సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు భారత్‌లో యూకే హైకమిషనర్‌గా ఉన్న అలెక్స్ ఈలీస్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే భారత్‌లోని యూకే బృందంతో పని చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు కామెరాన్ వెల్లడించారు.
భారత్‌లో యూకే హైకమిషనర్‌గా లిండి కామెరాన్ !
April 11, 2024
0
Tags