కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.  పరిశ్రమలు ఎక్కువగా ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లాలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. హత్నూర్ మండలం చందాపూర్ గ్రామ శివారు ప్రాంతంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. పరిశ్రమలో కార్మికులు పని చేస్తున్న సమయంలోనే రియాక్టర్ పేలడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది.ఈదుర్గటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మరో పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో చోటు చేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సమీక్షించారు. స్థానికులు, ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు ఇచ్చిన సమాచారంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటన స్తలానికి చేరుకున్నారు. గాయపడిన కార్మికుల్ని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రియాక్టర్ పేలిన ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఫ్యాక్టరీలోనికి ఎెవర్ని అనుమతించడం లేదు. ఈ భారీ అగ్నిప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారన్న వార్త అందరికి తెలియడంతో పెద్ద ఎత్తున కెమికల్ ఫ్యాక్టరీ దగ్గరకు జనం వస్తున్నారు. ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో చోటు చేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సమీక్షించారు. రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తక్షణమే సహాయక చర్యలు వేగవంతం చేసి, మంటలు అదువులోకి తీసుకురావాలని అగ్నిమాపక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి జిల్లా అధికారులకు సూచించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. సంగారెడ్డి పరిశ్రమలో రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందిన ఘటన పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)