ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో తమవారిని అక్రమంగా నిర్బంధించారంటూ విజయవాడ వడ్డెరకాలనీ వాసులు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా డాబాకొట్ల సెంటర్‌లో రాస్తారోకో చేశారు. రూ.200 ఇస్తామని చెప్పి జగన్ రోడ్‌షోకు తీసుకెళ్లారని, ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఎక్కడున్నారో కూడా చెప్పడం లేదని ఆవేదనకు గురయ్యారు. సీఎంపై రాయి దాడి జరిగిన సమయంలో తమ వారు ఆ ప్రాంతంలో లేకపోయినా ఐదుగురు పిల్లలను ఈరోజు తెల్లవారుజామున పోలీసులు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే విడుదల చేయకపోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
రాయి దాడి కేసులో అక్రమంగా ఇరికిస్తున్నారని వడ్డెర కాలనీ వాసులు ఆందోళన !
April 16, 2024
0
Tags