ఆంధ్రప్రదేశ్ లో 3వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ చేయనున్నట్లు అధికారుల తెలిపారు. ఇప్పటికే సజ్జల రామకృష్ణ రెడ్డ్డి అధికారిక ప్రకటన చేశారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత కూడా కీలక ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు, ఆర్ధిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో సామాజిక భద్రత పెన్షన్ 3 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు సచివాలయాలు వద్ద అందజేత ఉంటుందన్నారు. ఆధార్ కార్డు, పెన్షన్ పాసు పుస్తకం తీసుకొని పెన్షన్ లు తీసుకోవడానికి రావలసి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు సామాజిక భద్రత పెన్షన్ లని సచివాలయాలు వద్ద పంపిణీ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో 3 నుంచి పెన్షన్ల పంపిణీ !
April 01, 2024
0
Tags