మహారాష్ట్ర చేతికి ఎయిరిండియా భవనం !

Telugu Lo Computer
0


యిరిండియాకు చెందిన ప్రతిష్టాత్మక భవనాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,601 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో దక్షిణ ముంబయిలోని నారిమన్‌ పాయింట్‌ వద్ద ఉన్న ఎయిరిండియా భవనం యాజమాన్య హక్కులను మహారాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. ''ఏఐ అసెట్స్ హోల్డింగ్ కంపెనీ లిమిటెడ్ కు చెందిన ఎయిర్ ఇండియా భవనాన్ని రూ.1,601 కోట్లకు మహారాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడానికి కేంద్రం ఆమోదించింది. ఈ నేపథ్యంలో కంపెనీ బకాయిపడిన రూ.298.42 కోట్లను మాఫీ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది'' అని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఎయిరిండియాను టాటాలకు విక్రయించినప్పుడు ఎయిర్‌లైన్స్‌కు చెందిన నాన్-కోర్ ఆస్తుల్ని అందులో చేర్చలేదు. దీంతో సంస్థకు చెందిన భూమి, భవనాలు వంటి రూ.14,718 కోట్ల విలువైన వాటిని AIAHLకి బదిలీ చేసింది. ఇందులో 1974లో నిర్మించిన ఐకానిక్‌ కూడా ఉంది. 23 అంతస్థుల ఈ భవనాన్ని ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం చేజిక్కించుకుంది. దీన్ని సచివాలయంలోని కొన్ని విభాగాల కోసం ఉపయోగించుకోనున్నట్లు తెలిపింది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియాను టాటా గ్రూపు 2021 అక్టోబరులో రూ.18,000 కోట్లకు బిడ్డింగ్‌లో దక్కించుకుంది. దీంతో 2022 జనవరి 27న ఎయిరిండియాను టాటా గ్రూప్‌ అధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)