తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే కొందరు అధికారులను అరెస్ట్ చేయగా.. తాజాగా అరెస్టైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ తర్వాత అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అదుపులోకి తీసకోగా.. ఆయనను కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు. ఆయనకు 14రోజుల రిమాండ్‌ను న్యాయమూర్తి విధించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌లో పని చేసిన సమయంలో సస్పెండ్‌కు గురైన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా రాధాకిషన్‌రావు బృందం అనధికారికంగా ఫోన్లు ట్యాప్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి బంజారాహిల్స్ స్టేషన్లో రాధాకిషన్‌రావును విచారించిన దర్యాప్తు బృందం ఈరోజు ఆయనను అరెస్ట్ చూపించింది. దీంతో గాంధీ ఆసుప్రతిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ముందు ఆయనను పోలీసులు ప్రవేశ పెట్టారు. జడ్జి రిమాండ్ విధించడంతో రాధాకిషన్‌రావును చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీకి రిమాండ్ !
March 29, 2024
0
Tags