ఆంధ్రప్రదేశ్ లో పాలించాలనుకుంటున్నారు - ప్రశ్నించాలనుకోవట్లేదు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో పాలకులు ఢిల్లీలో గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానంలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న న్యాయసాధన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ‘ఇక్కడి 25 ఎంపీ స్థానాలు మోడీ ఖాతాలోనే ఉంటాయి. జగన్, చంద్రబాబు రాష్ట్రంలో వేర్వేరుగా ఉన్నా ఢిల్లీలో మోడీ  పక్కనే ఉంటారు. వారిద్దరూ పాలించాలనుకుంటున్నారు గానీ ప్రశ్నించాలనుకోవట్లేదని  అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత సమస్యల మీద పోరాడే నాయకులు కావాలి’ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీకి కావాల్సింది పాలకులు కాదని, ప్రశ్నించే గొంతుకలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ‘వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించండి అని కోరారు. మిమ్మల్ని ఎక్కువ అడగడం లేదు. 25 మంది ఎంఎల్ఏలు, ఐదుగురు ఎంపీలను ఇవ్వండి చాలు . షర్మిలమ్మ పోరాటం చేస్తారు అని హామీ ఇచ్చారు. ఎవరినైనా చొక్కా పట్టి ప్రశ్నిస్తారు. ఎలా మీ రాజధాని నిర్మాణం కాదో, ఎలా పోలవరం పూర్తికాదో, ఎలా విశాఖ ఉక్కును కొల్లగొడతారో చూసుకుంటారు. కంచె వేసి కాపాడుకుంటారు’ అని ఆయన అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)