ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం, పోలవరం అసెంబ్లీ అభ్యర్థులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. గిడ్డి సత్యనారాయణ పి.గన్నవరం, బాలరాజును పోలవరం నుంచి ఎంపిక చేశారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా తొలుత పి.గన్నవరం టికెట్ను టీడీపీకు కేటాయించిన విషయం తెలిసిందే. మహాసేన రాజేశ్ను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆ సీటును జనసేనకు కేటాయించారు. పి.గన్నవరం నియోజకవర్గ నేతలతో శనివారం జనసేన కార్యాలయంలో పవన్ సమావేశం నిర్వహించారు. పి.గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ గిడ్డి సత్యనారాయణకు ఎన్నికల నియమావళి, నిబంధనలతో కూడిన పత్రాలను అందజేశారు.
పి.గన్నవరం, పోలవరం అసెంబ్లీ స్థానాలకు జనసేన అభ్యర్థుల ప్రకటన !
March 23, 2024
0
Tags