బెంగళూరు నగరంలోని ఓ పాఠశాలలో పేలుడు పదార్థాలు లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. బెంగళూరులోని బెళ్లందూరులోని పాఠశాల ఆవరణం సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యం కావడంతో చిన్నారులు, వాళ్ల తల్లిదండ్రుల్లో ఆందోళనతో పరుగుతీశారు. బెంగళూరులోని బెళ్లందూరులోని ప్రక్రియా స్కూల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో జిలెటిన్ స్టిక్, డిటోనేటర్‌తో పాటు మరికొన్ని ప్రొజెక్‌టైల్‌లు కనిపించడంతో స్కూల్ లోని విద్యార్థులను, స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పేలుడు పదార్థాలను అక్రమంగా సేకరించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. పాఠశాలకు సమీపంలోనే భవనాన్ని నిర్మిస్తున్నారని, రాళ్లు పేల్చడానికి పేలుడు పదార్థాలు తెచ్చి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని ఒక ట్రాక్టర్‌లో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. అక్రమంగా పేలుడు పదార్థాల కొనుగోలు, రవాణాపై కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనా స్థలంలో ఆదారాలు సేకరించారు. బెళ్లందూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాఠశాలలో పేలుడు పదార్థాలు లభ్యం ?
March 19, 2024
0
Tags