తెలంగాణ బీఎస్పీ మాజీ అధ్యక్షుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎర్రవల్లిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆర్ఎస్పీతో పాటు బీఎస్పీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మద్దతుదారులు, అభిమానులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్‌లో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరే ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్యాకేజీల కోసం కాదు.. ప్రజా సేవ కోసమే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ నాయకత్వంలో పని చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. తనను అక్కున చేర్చుకుని ఇంత దూరం నడిపించిన తెలంగాణ ప్రజానీకానికి పాదాభివందనాలు ప్రవీణ్ కుమార్ తెలిపారు.
గులాబీ గూటికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ !
March 18, 2024
0
Tags