ఎల్ఐసీ ఉద్యోగులకు జీతాలు పెంపు !

Telugu Lo Computer
0

ఎల్ఐసీ సిబ్బందికి బేసిక్ లో 174 శాతం పెంపును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. వేతనాల పెంపు, భత్యాలతో కలిపి 22 శాతం వరకు వస్తుంది. దీంతో లక్ష మంది ఉద్యోగులు, 30వేల మంది పెన్షనర్లకు బెనిఫిట్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఎల్ ఐసీ ఉద్యోగులు, వారి కుటుంబాలకు ప్రయోజనం కలిగించే ఈ వేతన సవరణకు కేంద్ర ప్రభుత్వానికి ఎల్ ఐసీ కృతజ్ణతలు తెలిపింది. పెరిగిన జీతాలు ఆగస్టు 2022 నుంచి అమలు చేస్తారు. ఇటీవల డియర్ నెస్ అలవెన్స్ లో 50 శాతం పెంచిన తర్వాత తాజాగా ఈ పెంపుతో ఎల్ ఐసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్ నెస్ అలవెన్స్ లో 4 శాతం పెంచింది ప్రభుత్వం. ఎల్ ఐసీ ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ ప్రక్రియను చేపడుతోంది. తాజా వేతన సవరణతో ఎల్ ఐసీయన్లపై సానుకూల ప్రభావం చూపుతుందని, భవిష్యత్ తరానికి ఎల్ ఐసీని మరింత ఉపాధి కల్పిస్తుందని బీమా సంస్థ పేర్కొంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)