తెలంగాణలో మహిళలకు వడ్డీ లేని రుణాలు

Telugu Lo Computer
0


తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్తను అంధించింది. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన మహిళలకు వడ్డీలేని రుణాల పథకాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది.  దీనిపై ఈ రోజు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మార్చి 12న మహిళలకు వడ్డీలేని రుణాల పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. వడ్డీలేని రుణాల ద్వారా సూక్ష్మ, చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి మహిళా సంఘాలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. అలాగే తెలంగాణలో ని మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మిగా భావించి గౌరవిస్తుంది. కానీ గత ప్రభుత్వం స్వయం సహాయక బృందాలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)