బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. హిమాచల్ ప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జేపీ నడ్డా, ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తన హిమాచల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దానికి రాజ్యసభ చైర్మన్ ఆమోదం లభించింది. బీహార్‌లో పుట్టి పెరిగిన జగత్ ప్రకాష్(జేపీ) నడ్డా.. నరేంద్ర మోదీకి సహచరుడు. లాయర్‌గా కెరీర్‌ను ప్రారంభించి రాజకీయ నేతగా ఎదిగారు. ఆయన పూర్వ మూలాలు మాత్రం హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నాయి. అందుకే 1993 నుంచి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.. నెగ్గుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన ఆ రాష్ట్రానికి పలు శాఖల మంత్రిగానూ పని చేశారు. 2012లో హిమాచల్ అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ.. పెద్దల సభకు వెళ్లాల్సి రావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
రాజ్యసభ సభ్యత్వానికి జేపీ నడ్డా రాజీనామా !
March 04, 2024
0
Tags