ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామకు చెందిన నాలుగు నెలల పాప కైవల్య అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల కైవల్య పేరు నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఈ చిన్నారి కూరగాయలు, జంతువులు, పక్షుల చిత్రాలు వరకు మొత్తం 120 విభిన్న విషయాలను గుర్తించుకో గలుగుతోంది. ఆ చిన్నారి అద్భుతమైన ప్రతిభ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అభ్యాస సామర్థ్యం, ప్రతిభ అబ్బుర పరుస్తోంది. కైవల్యలో ఈ ప్రత్యేక సామర్థ్యాన్ని ఆమె తల్లి హేమ మొదట గమనించారు. కైవల్య ప్రతిభను తెలుపుతూ ఆమె తల్లి ఓ వీడియో తీశారు. ఈ వీడియోను నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు పంపించారు. కైవల్య ఈ ప్రత్యేక ప్రతిభను నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందం గుర్తించింది. అద్భుతమైన జ్ఞాపకశక్తి, విషయాలను గుర్తించే సామర్థ్యం ప్రశంసిస్తూ సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో కైవల్య ఇంత చిన్న వయస్సులో ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. ఈ ప్రపంచ రికార్డు 2024 ఫిబ్రవరి 3న నమోదైంది. వందకు పైగా ఫ్లాష్‌కార్డ్‌లను గుర్తించిన ప్రపంచంలోనే తొలి పాపగా నాలుగు నెలల కైవల్య రికార్డు సృష్టించింది.
నాలుగు నెలల చిన్నారికి నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు !
February 20, 2024
0
Tags