కృష్ణా నదిపై ఉన్న రెండు కీలక ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్‌ను కేఆర్ఎంబీకి అప్పగించడంపై ఈరోజు ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. ఆ తర్వాత కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను ఎంపీల బృందం కలిసింది. తమకున్న అభ్యంతరాలను తెలియజేస్తూ లేఖను అందజేశారు. ఈ నిర్ణయంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని, వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. కృష్ణా ట్రైబ్యునల్‌లో విచారణ పూర్తయ్యేవరకు రెండు రాష్ట్రాలకు 50:50 పద్ధతిలో నీటి కేటాయింపులు ఉండేలా చూడాలని షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్‌ను కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ ఎంపీలు నిరసన
February 02, 2024
0
Tags