ఆసుపత్రి వార్డులోకి ఎద్దు ?

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి వార్డులోకి ఎద్దు ప్రవేశించింది. దానిని చూసి రోగులు, వారి బంధువులు భయాందోళన చెందారు.  ఫిబ్రవరి 20న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోకి ఒక ఎద్దు వచ్చింది. అది నేరుగా రోగులు ఉన్న ఒక వార్డులోకి వెళ్లింది. దీంతో ఆ వార్డులోని బెడ్లపై ఉన్న రోగులు, ఆ పక్కగా ఉన్న వారి బంధువులు ఆ ఎద్దును చూసి భయాందోళన చెందారు. కాగా, ప్రభుత్వ ఆసుపత్రి వార్డులో కొంతసేపు ఉన్న ఆ ఎద్దు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. అది ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆసుపత్రి వార్డులోకి ఎద్దు ప్రవేశించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడ్డారు. అలాగే ఉత్తరప్రదేశ్‌ అంతటా వీధుల్లో పశువుల సంచారం వల్ల స్థానికులు భయాందోళన చెందడంతోపాటు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొందరు తెలిపారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని మరికొందరు విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)