గుల్మార్గ్‌ను ముంచెత్తిన హిమపాతం !

Telugu Lo Computer
0


త్తర కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో భారీ హిమపాతం ముంచెత్తింది. ఈ ఘటనలో ఒక విదేశీ స్కీయర్‌ మరణించగా, మరొకరు గల్లంతయ్యారు. మరో ముగ్గురిని భద్రతా సిబ్బంది కాపాడినట్లు అధికారులు తెలిపారు. ప్రముఖ స్కీయింగ్‌ ప్రాంతమైన అఫర్వాత్‌ శిఖరం వాలుపై ఖిలాన్‌ మార్గంలో హిమపాతం సంభవించిందని అన్నారు. ఈ హిమపాతంలో సుమారు ఐదుగురు స్కీయర్లు చిక్కుకున్నారని అన్నారు. ఆర్మీ, జమ్ముకాశ్మీర్‌ పెట్రోలింగ్‌ బృందం సహాయక చర్యలను చేపడుతోంది. ఖేలో ఇండియా వింటర్‌ గేమ్స్‌ అథ్లెట్లందరూ సురక్షితంగా ఉన్నారని సెక్రటరీ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ నుజాత్‌ గుల్‌ పేర్కొన్నారు. అన్ని మ్యాచ్‌లు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయని చెప్పారు. కాగా, ఈ గేమ్స్‌లో పాల్గొంటున్న సుమారు 800 మంది అథ్లెట్లు ఇటీవల గుల్‌మార్గ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)