ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ధరల పట్టికను ప్రదర్శించాల్సిందే !

Telugu Lo Computer
0


ర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ ఆసుపత్రులు, క్లినిక్‌లు వైద్యపరీక్షలు, చికిత్సల ధరల ప ట్టికలను ప్రదర్శించాల్సిందేనని ఆరోగ్య శాఖ మంత్రి దినేష్‌ గుండూరావు పేర్కొ న్నారు. శాసనసభ ఉభయసభల్లోనూ కొందరు సభ్యులు ప్రైవేట్‌ ఆసుపత్రులు వైద్యపరీక్షలు, చికిత్సల పేరిట రోగుల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయంటూ ఆరోపించిన నేపథ్యంలో మంత్రి ఈ మేరకు వివరణ ఇచ్చారు. కేపీఎంఈ చట్టాల ప్రకారం ప్రైవేట్‌ ఆసుపత్రులు ఏ వైద్యపరీక్షకు ఎంత ధర, చికిత్సలకు ఎంత ధర అనే బోర్డులను ప్రదర్శించాలని ఇలా ప్రదర్శించకపోతే నోటీసులు ఇచ్చి ఆపై లైసెన్సులను రద్దుచేయాల్సి ఉంటుందని హె చ్చరించారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షణ జరిపేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. యశస్విని పథకం క్రింద ఉచిత వైద్యచికిత్సలను అందజేసేందుకు నిరాకరించే ఆసుపత్రులపై కూడా చర్యలు ఉంటాయన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)