షబ్-ఇ-మెరాజ్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించింది. అయితే ఇది సాధారణ సెలవు కాకుండా ఐచ్ఛిక సెలవు కింద క్యాలండర్ లో పేర్కొంది. ఇప్పుడు దీన్ని సాధారణ సెలవుగా మార్చింది. షబ్-ఇ-మెరాజ్ ను ముస్లిములు పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు ఈ పర్వాన మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం జేస్తూ ప్రార్థనలు చేస్తారు. ఇస్రా, మేరాజ్ ల కథ చెబుతారు. ఫిబ్రవరి 8న సాధారణ సెలవు కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసివేయనున్నారు. ప్రభుత్వ విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ ప్రకారం మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా సెలవు ఉంది. మార్చి 25 హోలీ హాలీ డే ఉంది. మార్చి 29 గుడ్ ఫ్రైడే సందర్భగా సెలవు ఇచ్చారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయింతి సందర్భంగా హాలీడే డిక్లెర్ చేశారు. ఏప్రిల్ 9 ఉగాది సెలవు ఉంది. ఏప్రిల్ 11,12న రంజాన్ సెలవు ప్రకటించారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా హాలీడే ఉంది. ఏప్రిల్ 17 శ్రీరామనవమికి కూడా సెలవు ఇచ్చారు. జూన్ 17 బక్రిద్ సెలవు ఉంది. జులై 17న మెహర్రం హాలీడే ఉంది. జులై 29న బోనాల సందర్భంగా సెలవు ప్రకటించారు. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే హాలీ డే ఉంది. ఆగస్ట్ 26 శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సెలవు ఇచ్చారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి హాలీ డే ఉంది. సెప్టెంబర్ 16 ఇద్ నబీ కి సెలవు ఇచ్చారు. అక్టోబర్ 2న మహత్మ గాంధీ జయంతి సందర్బంగా సెలవు ఉంటుంది. అక్టోబర్ 12, 13 దసరా సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 31 దీపావళి హాలీ డే ఉంది. నవంబర్ 15 గురు ననాక్ జయింతి సందర్భంగా సెలవు ఉంది. డిసెంబర్ 25, 26 క్రిస్ మస్ సెలవులు ఉన్నాయి.
షబ్-ఇ-మెరాజ్ పండుగను సాధారణ సెలవుగా ప్రకటన !
February 01, 2024
0
Tags