తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలో ఓ పీజీ వైద్య విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. సోమవారం ఉదయం ఓఆర్‌ఆర్‌పై కారులో విద్యార్థిని అపస్మారకస్థితిలో పడి ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆమె పనిచేస్తున్న బాచుపల్లిలోని ప్రైవేటు ఆస్ప్రతికి తరలించారు. సాయంత్రం 4 గంటల సమయంలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. విద్యార్థిని ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా తమకు ఫిర్యాదు అందలేదని.. అందితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి
February 12, 2024
0
Tags