మేడారంలో మంత్రి సీతక్క ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ జాతరకు గతంలో కంటే రెట్టింపుగా ఆరు వేల ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆర్‌టీసీ సిబ్బంది ఓపికతో బస్సులు నడపాలని, భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని, ప్రయాణం చేసే భక్తులు సంతోషంగా వచ్చి వెళ్లేలా చూడాలని కోరారు. పైసా ఖర్చు లేకుండా దర్శనం చేసుకునే ఏకైక జాతర మేడారమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేశారని తెలిపారు . బస్ టికెట్ కౌంటర్స్, క్యూ లైన్స్ ను మంత్రి ప్రారంభించారు.
మేడారంలో తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం !
February 17, 2024
0
Tags