అమెరికాలోని ఇండియానా ప్రాంతంలో చార్లెస్ మైఖేల్ కాల్వెర్ట్ (60), మార్సియా లిన్స్కీని స్నేహితులుగా ఉంటూ కలిసి జీవిస్తున్నారు. అయితే ఉల్లిపాయలు కోసే విషయంలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. అంతే ఆవేశంలో ఆమె కత్తితో అతనిపైకి వచ్చింది. అతడు కూడా కోపం తెచ్చుకుని అదే కత్తితో ఆమెను పొడిచి చంపేశాడు. పోలీసుల సమాచార ప్రకార లిన్స్కీ రక్తపు మడుగులో ఉందని, మెడపై పెద్ద గాయంతో ఆమె మరణించిందని తెలిపారు. లిన్స్కీనే మొదట కత్తితో అతని పైకి వచ్చిందని.. ఆత్మ రక్షణ కోసం అతని చేతిలో ఉన్న కత్తితో పొడిచి చంపాడని వెల్లడించారు.
ఉల్లిపాయలు కోసే విషయంలో ఘర్షణ : ఒకరు హత్య
February 11, 2024
0
Tags