తెలంగాణలో ఢిల్లీ తరహా పబ్లిక్ స్కూల్స్ !

Telugu Lo Computer
0


సెంబ్లీలో ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టీ విక్రమార్క ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన బడ్జెట్ పై ప్రసంగిస్తూ మా ప్రభుత్వం రాష్ట్రంలో విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రతి పేదవాడికి విద్యను అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యారంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఈ బడ్జెట్ లో రూ. 21,389 కోట్లు కేటాయించామని తెలిపారు. ఢిల్లీ తరహాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ లను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భరంగా చెప్పారు. దీని కోసం బడ్జెట్ లో రూ. 500 కోట్లను కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో ఫీజు రీఇంబర్స్ మెంట్ తోపాటు స్కాలర్ షిప్ లను సకాలంలో అందజేస్తామని, ఐటీఐ కాలేజీలకు పూర్వవైభవం తీసుకొస్తామని, నిరుద్యోగులకు వంద శాతం ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సర్కార్ ఆలోచన చేస్తుందన్నారు. దీని కోసం గుజరాత్, ఢిల్లీ, ఒడిశా రాష్ట్రల్లో అధ్యయనంకు అధికారుల బృందాన్ని పంపిస్తామని చెప్పారు. ఓయూ తోపాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలకు రూ.500 కోట్లు కేటాయించడం జరిగిందని ఆయన వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)