తెలంగాణ మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి, వికారాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ సునీతారెడ్డి గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రేవంత్‌కు పట్నం దంపతులు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సమావేశంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి కుమారుడు రినీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహేందర్‌రెడ్డితో పాటు తాను, తమ అనుచరవర్గం వారం రోజుల్లో కాంగ్రెస్‌లో చేరతామని సునీతారెడ్డి గురువారం రాత్రి 'న్యూస్‌టుడే'కు తెలిపారు. దిల్లీ లేదా హైదరాబాద్ వేదికగా పార్టీలో చేరాలా, జిల్లాలో బహిరంగ సభ నిర్వహించి చేరాలా అనే విషయమై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరడం మాత్రం ఖాయమని స్పష్టంచేశారు. శాసనసభ ఎన్నికలకు ముందే మహేందర్‌రెడ్డి, సునీతారెడ్డిలు కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరిగినా.. వారు భారాసలోనే కొనసాగారు. ఆ ఎన్నికల్లో తాండూరు భారాస టికెట్‌ను మహేందర్‌రెడ్డి ఆశించారు. అయితే అధిష్ఠానం రోహిత్‌రెడ్డికి టికెట్ కేటాయించింది. మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చింది. సునీతారెడ్డి కాంగ్రెస్ నుంచి చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
వారం రోజుల్లో కాంగ్రెస్‌లో చేరతాం !
February 09, 2024
0
Tags