వ్యవసాయ భూములకే రైతుబంధు !

Telugu Lo Computer
0


తెలంగాణలో వ్యవసాయ భూములకే రైతుబంధు అమలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వ్యవసాయం చేసే రైతులకు రైతుబంధు అందాల్సిన అవసరం ఉందన్నారు. పెట్టుబడి సాయం కావాల్సింది రైతులకేనని వివరించారు. హైవేలు, రియల్ ఎస్టేట్ లో ఉన్న భూములకు రైతు బంధు అందదని చెప్పారు. రైతు బంధు అమలు పైన అన్ని విషయాలు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే వాస్తవాలు చెబుతున్నామన్నారు. తొలి రోజునే రాష్ట్రంలోని ఆర్దిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచామని గుర్తు చేసారు. గత ప్రభుత్వం మాదిరిగా తాము అసత్యాలతో బడ్జెట్ ప్రవేశ పెట్టలేదన్నారు. మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ జరిపిస్తామన్నారు. విచారణ తర్వాతే చర్యలుంటాయని చెప్పారు. తమ ఎమ్మెల్యేలనే కాదు, ప్రతిపక్షాలనూ అక్కడికి తీసుకెళ్తామని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వివరించారు. తమ పాలన నచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముందుకువస్తే కలిసివెళ్తామని కీలక వ్యాఖ్యలు చేసారు. 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారని జగ్గారెడ్డి అన్నారంటున్నారని, ఈ విషయంపై ఆయన్నే అడగాలని రేవంత్ చెప్పుకొచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)