బాల రాముడిని దర్శించుకునేందుకు అయోధ్యకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. జనవరి 22న బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 19 లక్షల మంది దర్శించుకున్నట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. నిన్నటి వరకు 18.75 లక్షల మంది యాత్రికులు సందర్శించినట్లు యోగి సర్కారు పేర్కొంది. నిన్న 3.25 లక్షల మంది భక్తులు రామదర్శనం చేసుకున్నారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య 'బాలక్ రామ్' ప్రాణప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ఆ వేడుకను చూసేందుకు దేశ నలుమూలల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. అయితే సామాన్య భక్త జనానికి మాత్రం జనవరి 23 నుంచి దర్శనభాగ్యం కల్పించారు. రాములోరితోపాటు ఈ భవ్యమైన మందిర నిర్మాణాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు తండోపతండాలుగా అయోధ్యకు తరలివెళ్తున్నారు. కేవలం ఆరు రోజుల్లోనే 19 లక్షల మంది రామయ్య దర్శనం చేసుకున్నారు.
అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు !
January 29, 2024
0
Tags