కర్ణాటక కాంగ్రెస్ ఎమ్ఎల్ఎ కెవై నంజే గౌడ కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం దాడులు చేసింది. మనీల్యాండరింగ్ కేసులో దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. గౌడకు చెందిన మాలూర్, కోలార్ ఏరియాల్లోని కార్యాలయాలపై దాడులు చేశారు. కోలార్ చిక్కబల్లాపూర్ జిల్లా కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్‌కు ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న నంజే గౌడ ఆ యూనియన్‌లో సిబ్బంది నియామకంలో అక్రమాలు జరిగాయని స్థానిక పోలీసులకు అందిన ఫిర్యాదుల ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదైంది. కోలార్ మిల్క్ కో ఆపరేటివ్ కార్యాలయం, ప్లాంట్ లో సోదాలు జరిగాయి. కర్ణాటక రాష్ట్రంలో రెండవ అతి పెద్ద పాల ఉత్పత్తి సంఘం కోలార్ జిల్లా కోఆపరేటివ్ సంస్థ. ఈ సొసైటీ పరిధిలో 11 రెవెన్యూ తాలూకాలు, 2919 గ్రామాలు ఉన్నాయి.
నంజే గౌడ కార్యాలయాలపై ఈడీ దాడులు
January 08, 2024
0
Tags