పెళ్లికి నిరాకరించిన మరదలుపై కత్తితో దాడి !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో పెళ్లికి నిరాకరించడంతో మరదలుపై బావ దాడి చేశాడు. ఆమె మెడపై కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. 25 ఏళ్ల యువతి తన మేనమామ ఇంట్లో ఉంటున్నది. బావ అయిన 26 ఏళ్ల జ్ఞాన ప్రకాష్, ఆమె ఒకే కాలేజీలో లా చదువుతున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రకాష్‌ తన మరదలు వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో ఆగ్రహించి మరదలు మెడపై కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, తీవ్రంగా గాయపడిన మహిళను ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పరారిలో ఉన్న నిందితుడు ప్రకాష్‌ కోసం వెతుకుతున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)