ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కోడలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పీఏ వెంకటేశ్వరరావు అక్కడిక్కడే మృతి చెందారు. జాతీయ రహదారి వద్ద కంటైనర్ టైర్ పగిలి సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. వెనుక నుంచి వేగంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు వెళ్తుండగా కంటైనర్ టైర్ పగిలి సడన్ బ్రేక్ వేయడంతో ఆ కంటైనర్‌ను కారు వెనక నుంచి ఢీ కొట్టింది.. ఆ తర్వాత బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్‌రెడ్డి పీఏ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తలకు బలమైన గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఆ రోడ్డులో వస్తున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన కారులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిని ఆస్పత్రిలోకి తరలించారు. ప్రమాదాన్ని చూసి కారు ఆపిన జానీ మాస్టర్ ఎమ్మెల్సీకి బలమైన గాయాలు కావడంతో తలకి కట్టుకట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు క్షతగాత్రులను తన కారులో నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదం ఎమ్మెల్సీ పీఏ దుర్మరణం !
January 05, 2024
0
Tags