రేపటి నుండి రెండు రోజులపాటు పెట్రోల్ ట్యాంకర్ల సమ్మె చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. హైదరాబాద్ నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ లైన్ లలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హిట్ అండ్ రన్’ వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోయింది. వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడనుంది. దీంతో ముందస్తు వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద భారీ ఎత్తున క్యూ కడుతున్నారు. భారతీయ న్యాయ సంహిత ప్రకారం భారతీయ శిక్షాస్మృతిని భర్తీ చేసింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ద్వారా తీవ్రమైన రోడ్డు ప్రమాదాన్ని కలిగించి, పోలీసులకు లేదా పరిపాలనలోని ఏ అధికారికి సమాచారం ఇవ్వకుండా పారిపోయిన డ్రైవర్లకు గరిష్టంగా 10 సంవత్సరాల శిక్ష లేదా 7 లక్షల జరిమానా విధించింది. ఈ క్రమంలో.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని పెట్రోల్, డీజిల్ ట్యాంకర్స్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు.
రేపటి నుండి పెట్రోల్ ట్యాంకర్ల సమ్మె
January 02, 2024
0
Tags