శ్రీరాముడి దర్శనానికి సామాన్య భక్తులు ఇవాళ తెల్లవారుజామున 3 గంటల నుంచే మెయిన్ గేటు వద్ద బారులు తీరారు. ఉదయం ఏడు గంటల నుంచి భక్తుల్ని నిర్వాహకులు అనుమతిస్తున్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నందున అవసరమైతే స్వామివారి దర్శన సమయాన్ని పొడిగించాలని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ యోచిస్తోంది. రామ్ లల్లా దర్శనం కోసం రెండు స్లాట్లు కేటాయిస్తున్నట్లు నిన్న ట్రస్ట్ ప్రకటించింది. ఉదయం 7గం. నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గం. వరకు రెండు దఫాలుగా భక్తులను అనుమతిస్తామని ప్రకటించారు. రోజుకు ఆరుసార్లు హారతి నిర్వహిస్తారు. ఇందుకోసం భక్తులకు పాస్‌లు జారీ చేస్తారు. ఇప్పటి వరకు రామ్‌లల్లాకు రోజుకు రెండు హారతులు ఉండేవి. ఇకపై రోజుకు ఆరు హారతులు ఉంటాయని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.
శ్రీరాముడి దర్శనానికి పోటెత్తిన సామాన్య భక్తులు
January 23, 2024
0
Tags