ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల ఈనెల 21న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాణిక్కం ఠాకూర్, మయప్పన్‌తో పాటు ఏపీకి చెందిన సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న సమయంలో షర్మిలకు అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి రాష్ట్రం వీడిపోయిన తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలయ్యింది. విభజన వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపిస్తూ ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటు వేయలేదు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా 21నవైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరణ
January 18, 2024
0
Tags