రూ. 10 ప్యాకెట్‌లో ఐదు చిప్స్‌ ?

Telugu Lo Computer
0


పది రూపాయల చిప్స్ ప్యాకెట్ కొన్న వినియోగదారుడికి అందులో అక్షరాలా ఐదు చిప్స్ మాత్రమే ఉండటంతో అతనికి ఎమీ అర్థం కాలేదు. నిరాశతో అతన్ని దాన్ని ఫోటోలు తీసి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం రెడిట్‌లో షేర్‌ చేశాడు. అందులో కేవలం 5 చిప్స్ మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. టూ యమ్ స్పైసీ చిల్లీ పొటాటో వేఫర్స్ ప్యాకెట్ కోసం రూ.10 చెల్లించానని, అయితే ప్యాకెట్ తెరిచి చూడగా అందులో కేవలం 5 చిప్స్ ఉండడంతో ఆశ్చర్యపోయానని పేర్కొన్నాడు. ఫోటోను షేర్‌ చేస్తూ వినియోగదారుడు ఇలా రాశాడు..నేను ఫిర్యాదు చేయడానికి, కంపెనీకి చెప్పడానికి ఏదైనా మార్గం ఉందా? అంటూ అడిగాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జనాలు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వైరల్‌ అవుతున్న పోస్ట్‌పై నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఒక్కో పీస్‌కు రెండు రూపాయల ఖరీదు భయ్యా అంటూ ఒకరు కామెంట్ చేయగా, ఇకపై రెండు రూపాయల చేంజ్ లేకపోతే ఒక చిప్‌ చేతిలో పెడతారేమో అంటూ మరొక యూజర్‌ ఫన్నీగా వ్యాఖ్యనించారు. కంపెనీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తోంది. కాబట్టి ఎక్కువ చిప్స్‌ ఇవ్వలేదంటూ మరొకరు వ్యాఖ్యానించారు. గత 27 ఏళ్లుగా టాప్‌ క్వాలీటీ మసాలా ఎయిర్‌ అమ్ముతూనే ఉన్నారు.. అది కాస్ట్‌లీ గ్యాస్‌… మనం తినే చిప్స్‌ జస్ట్‌ కాంప్లిమెంట్‌.. ఇలా రకరకాల కామెంట్లతో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)