ఏ దస్త్రాలపై సంతకం చేయలేదు !

Telugu Lo Computer
0


క్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రదాడులకు పాల్పడిన నేపథ్యంలో  మిత్రపక్షమైన భారత్‌ని ఆ సంస్థను ఉగ్రసంస్థగా ప్రకటించాలని గతంలో ఇజ్రాయెల్ రాయబారి భారతదేశాన్ని అభ్యర్థించింది. అయితే ఈ అంశంపై భారత్ ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంతలో హమాస్‌ని ఉగ్రసంస్థగా ప్రకటించే యోచనలో భారత్ ఉందా? అనే ప్రశ్నతో కూడిన దస్త్రాలపై కేంద్రమంత్రి మీనాక్షి లేఖి సంతకం చేసినట్లు ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. కొన్ని దస్త్రాలు కూడా వైరల్ అయ్యాయి. అయితే.. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా మీనాక్షి స్పష్టం చేశారు. ఇది తప్పుడు సమాచారం అని, తాను ఏ పేపర్‌పై కూడా సంతకం చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ''మీ ముందు తప్పుడు సమాచారం ఉంది. నేను ఏ దస్త్రాలపై కూడా సంతకం చేయలేదు. విచారణ ద్వారా అసలు నేరస్తుల బయటపడతారు'' అంటూ ఎక్స్ వేదికగా మీనాక్షి లేఖి స్పందించారు. ఈ నేపథ్యంలో హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా? అని కాంగ్రెస్ ఎంపీ కుంభకుడి సుధాకరన్ ప్రశ్నించారు. అందుకు ఆమె బదులిస్తూ ఒక సంస్థను ఉగ్రవాదిగా ప్రకటించడం చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం పరిధిలోకి వస్తుందని బదులిచ్చారు. అలాగే.. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలోనూ తాను ఎలాంటి పత్రంపై సంతకం చేయలేదని ఆమె మరోసారి స్పష్టతనిచ్చారు. ఈ విషయాన్ని తాను పీఎంఓ,  జైశంకర్‌ దృష్టికి తీసుకెళ్లానని  విదేశాంగ కార్యదర్శికి ఫోన్ చేసి దీనిపై విచారణ జరిపించాలని కోరానని  ఇందుకు పాల్పడిన వారిపై వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశానని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)