ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కేంద్రానికి సమీపంలో చిన్నంపల్లి క్రాస్ వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఐచర్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రాళ్ల లోడుతో వెళుతున్న లారీ టైరు పంక్చర్ కావడంతో లారీని పక్కకు నిలిపారు. అదే సమయంలో అనంతపురం నుంచి కల్యాణదుర్గం వెళుతున్న ఖాలీ ఐచర్ వాహనం అతి వేగంగా వచ్చి లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐచర్ వాహనంలో ఉన్న నలుగురిలో ముగ్గురు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఐచర్ వాహనం : ముగ్గురు మృతి
December 17, 2023
0
Tags