సలాడ్‌లో నత్త దర్శనం !

Telugu Lo Computer
0


బెంగళూరు చెందిన ధావల్ సింగ్ అనే వ్యక్తి ఇటీవల లియోన్ గ్రిల్ అనే రెస్టారెంట్ నుంచి స్వీగ్గి ద్వారా సలాడ్ ఆర్డర్ చేసుకున్నాడు. టైంకి ఫుడ్ డైలివరి అయినా.. అతడికి మాత్రం షాకింగ్ అనుభవం ఎదురైంది. ఫుడ్ పార్సల్ ఓపెన్ చేయగానే సింగ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సలాడ్‌లో ప్రాణంతో కదులుతున్న నత్త లాంటి పురుగు కనిపించింది. అది చూసి కంగుతిన్న అతడు అది వీడియో తీశాడు. వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ సదరు రెస్టారెంట్‌ను ట్యాగ్ చేశాడు. 'లియోన్ గ్రిల్ నుంచి ఇంకేప్పుడు నేను ఫుడ్ ఆర్ట్ చేసుకోవద్దు.. ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎవరికీ జరగకుండా చూసుకోవడానికి @SwiggyCares ఏమైనా చర్యలు తీసుకుంటుందా?' అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే అతడి పోస్ట్ స్విగ్గీ స్పందించింది. 'హాయ్ ధవల్. ఇది నిజంగా భయంకరమైనది. దయచేసి ఆర్డర్ ఐడీ షేర్ చేసి మాకు సహాయం చేయండి. మేము దానిని పరిశీలించి చర్యలు తీసుకుంటాం' అంటూ ట్వీట్ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)