పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ఎంపీలందరికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా లేఖ రాశారు. డిసెంబర్ 13న పార్లమెంట్ భవనం లోపల ఇద్దరు నిరసనకారులు గ్యాస్ డబ్బాలతో పొగను వెదజల్లిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్పీకర్ ఓం బిర్లా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటనపై లోతైన విచారణ కోసం ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశామని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లో భద్రతకు సంబంధించిన పలు అంశాలను సమీక్షించి హైపవర్డ్ కమిటీ ఏర్పాటు చేసినట్టు లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్‌లో సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని స్పీకర్ ఓం బిర్లా లేఖలో తెలిపారు.
పార్లమెంట్ సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా లేఖ !
December 16, 2023
0
Tags