తల్లిని చంపిన ఐఐటీ విద్యార్థి !

Telugu Lo Computer
0

బీహార్‌కు చెందిన హిమాన్షు అనే వ్యక్తి ఐఐటీ చదువుతున్నాడు. తన తల్లి ప్రతిమా దేవితో కలిసి హర్యానాలోని హిసార్‌లో ఉంటున్నాడు. అయితే హిమాన్షు తన తల్లిని 5000 రూపాయలు అడగడంతో గొడవ మొదలైంది. డబ్బులు ఇవ్వడానికి ప్రతిమా దేవి నిరాకరించడంతో హిమాన్షు ఆవేశంతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ఉంచి ప్రయాగ్‌రాజ్‌కు తరలించాడు. హిమాన్షు మొదట హర్యానాలోని హిసార్ స్టేషన్ నుండి ఘజియాబాద్ చేరుకున్నాడు ఆ తరువాత ప్రయాగ్‌రాజ్ చేరుకున్నాడు. అయితే నది ఒడ్డున నిందితుడు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సూట్‌కేస్‌లో మరణించిన మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. డబ్బు విషయంలో తలెత్తిన గొడవతోనే ఈ హత్యకు పాల్పడినట్లుగా హిమాన్షు పోలీసులకు వెల్లడించాడు. డబ్బులు ఎందుకు డిమాండ్ చేశాడన్నది మాత్రం తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)