కర్ణాటక ప్రభత్వం హిజాబ్ ధరించిండంపై ఎటువంటి నిషేధం ఉండదని, నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. మైసూర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హిజాబ్‌పై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ప్రకటించారు. మహిళలు వారికి ఏది నచ్చితే వాటిని ధరించవచ్చని తెలిపారు. హిజాబ్ ధరించి ఎక్కడికైనా వెళ్లవచ్చని, హిజాబ్‌పై బ్యాన్‌ను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఏ డ్రెస్ వేసుకుంటారు.. ఏం తింటారు.. అనేది వారి వ్యక్తిగత ఎంపిక అని సీఎం అన్నారు. 'నేను ఎందుకు అడ్డుకోవాలి? మీ ఇష్టం మేరకు నచ్చినట్లు హిజాబ్ ధరించవచ్చు' అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.
కర్ణాటక లో హిజాబ్ నిషేధం ఎత్తివేత !
December 22, 2023
0
Tags