కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇందిరా క్యాంటీన్ !

Telugu Lo Computer
0


బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇందిరా క్యాంటీన్ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అల్పాహారం రూ. 5, మధ్యాహ్న భోజనం రూ.10కే అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విమానాశ్రయంలోని పార్కింగ్ ప్రాంతంలో 2 ఇందిరా క్యాంటీన్‌లను ప్రారంభించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. బెంగళూరులో ఇప్పటికే 175కి పైగా ఇందిరా క్యాంటీన్‌లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇందిరా క్యాంటీన్‌లలో కేవలం రూ. 5కే అల్ఫాహారం, రూ. 10కే మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇందిరా క్యాంటీన్‌లకు నాణ్యమైన ఆహారం అందడం లేదని, వాటిని మూసేయాలని ఆలోచన చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీఎం సిద్ధరామయ్య ఇందిరా క్యాంటీన్‌లలో లంచ్, స్నాక్స్ మెనూను మార్చారు. రాగి ముద్ద, మంగళూరు బన్స్‌తో సహా పలు రకాల భోజనాలు వడ్డిస్తున్నారు. ఖరీదైన ఫుడ్ అవుట్‌లెట్లలో కూడా ఇందిరా క్యాంటీన్ లో భోజనం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)