ఆంధ్రప్రదేశ్ కి భారీ వర్ష సూచన !

Telugu Lo Computer
0


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం ఏపీలో పెద్దగా కనిపించలేదు. గత నాలుగేళ్లల్లో కురిసిన వర్షాలు ఈ సారి లేవు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఈశాన్య రుతు పవనాల ప్రభావం ఈ లోటును అధిగమిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అల్పపీడన ప్రభావంతో వర్షాల తీవ్రత మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుందని ఐఎండీ, ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ తెలియజేశాయి. 14 జిల్లాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదువుతుందని అంచనా వేశాయి. ఉత్తరాంధ్రలోని అల్లూరి సీతారామరాజు, ఉత్తర కోస్తా రీజియన్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీడీఎంఏ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)