జైపూర్లో కోహ్లీ మైనపు విగ్రహం !

Telugu Lo Computer
0


రాజస్థాన్ లోని జైపూర్  నహర్ గఢ్ కోటలో ఉన్న మైనపు విగ్రహాల మ్యూజియంలో కోహ్లీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. జైపూర్ వ్యాక్స్ మ్యూజియం వ్యవస్థాప డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఇక్కడ కోహ్లీ మైనపు విగ్రహం ఏర్పాటు చేయాలంటూ పర్యాటకులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారన్నారు. అలాంటి తరుణంలో కోహ్లీ వన్డేల్లో 50 సెంచరీలతో అద్భుతమైన రికార్డు నమోదు చేశాడని, అంతేకాకుండా  టీమిండియా వరల్డ్ కప్ టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో ఉందన్నారు. అందుకోసమని విగ్రహం ఏర్పాటు చేయడానికి ఇంతకంటే మంచి తరుణం ఏముంటుందని అన్నారు. ప్రస్తుతానికి బంక మన్నుతో కోహ్లీ నమూనా విగ్రహాన్ని రూపొందించామని, మరో నెలలో పూర్తిస్థాయి మైనపు విగ్రహం తయారు చేస్తామని శ్రీవాస్తవ తెలిపారు. అంతేకాకుండా అటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మైనపు విగ్రహాన్ని కూడా మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)