ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల లబ్ధిదారులతో గురువారం ప్రధాని నరేంద్ర మోడీ సంభాషించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేరిట దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న కార్యక్రమంలో వర్చువల్‌గా మాట్లాడిన ఆయన వారి నుంచి పలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సరదా సన్నివేశం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి తాను లబ్ధి పొందానని జమ్మూకు చెందిన సర్పంచ్ బల్వీర్ కౌర్ ప్రధానికి తెలిపారు. కౌర్ మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న కొందరు కుర్చీ కోసం ఆమెను నెట్టడం ఆయన గమనించారు. దాంతో ఆమెను సరదాగా హెచ్చరించారు. 'మీ కుర్చీ గట్టిగా పట్టుకోండి. లేకపోతే ఆమె కొత్త సర్పంచ్ అవుతారు' అని చమత్కరించారు. ఆ తర్వాత తాను కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఒక ట్రాక్టర్ కొనుగోలు చేసినట్లు కౌర్ చెప్పగా, ఆమె మాటలకు మోడీ సంతోషం వ్యక్తం చేశారు.'మీకు ట్రాక్టర్ ఉంది. నాకు కనీసం సైకిల్ కూడా లేదు' అని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మోడీ సంకల్ప్ యాత్ర ఉద్దేశాన్ని వెల్లడించారు. తాము లబ్ధిదారుల అనుభవాలు తెలుసుకొని, మిగతా వారికి ఆ ఫలాలను అందించడమే తమ లక్ష్యమన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ పాలనను ఎండగట్టారు.
మీకు ట్రాక్టర్ ఉంది - నాకు కనీసం సైకిల్ కూడా లేదు !
November 30, 2023
0
Tags