వరవరరావుకు కాటరాక్ట్ వెసులుబాటు !

Telugu Lo Computer
0


ల్గార్ కేసు నిందితుడు కవి పెండ్యాల వరవర రావు కంటి ఆపరేషన్‌కు హైదరాబాద్‌కు వెళ్లేందుకు స్థానిక కోర్టు అనుమతి ఇచ్చింది. జాతీయ దర్యాప్తు సంస్థ అనుబంధ ప్రత్యేక కోర్టు గురువారం ఈ మేరకు ఆయనకు వీలు కల్పిస్తూ రూలింగ్‌ వెలువరించింది. 2018 ఎల్గార్ పరిషత్ మావోయిస్టు లింక్‌ల కేసులో వరవరరావుపై అభియోగాలు ఉన్నాయి. తనకు ఎడమ కంటికి కాంటరాక్ట్ ఆపరేషన్ అవసరం అని, హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుందని నిందితుడు విన్నవించుకున్నారు. దీనిపై న్యాయమూర్తి రాజేష్ కటారియా తమ ఆదేశాలు వెలువరించారు. డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 11 మధ్యలో నిందితుడు హైదరాబాద్‌కు వెళ్లిరావచ్చునని న్యాయమూర్తి తెలిపారు. హైదరాబాద్‌లో తాను ఉండే నివాసం చిరునామా , కాంటాక్టు నెంబరును వరవర రావు డిసెంబర్ 4వ తేదీన తమకు అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయనకు కల్పించే స్వేచ్ఛను ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగపర్చుకోరాదని షరతు పెడుతూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఆయన వైద్య చికిత్సల కారణాలపైనే బెయిల్‌పై ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)