మధ్యప్రదేశ్‌లోని దాతియాలోని ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పాల్గొని మాట్లాడుతూ బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింథియాపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. సింథియాను ద్రోహిగా పేర్కొన్నారు. యూపీలో గతంలో ఎన్నికల ప్రచారంలో సింథియాతో కలిసి పనిచేసిట్లు చెప్పిన ప్రియాంక గాంధీ, పొట్టిగానే ఉంటాడు కానీ.. అహంకారం మాత్రం చాలా ఎక్కువని మండిపడ్డారు. 'ఎవరు ఆయన వద్దకు వెళ్లినా మహారాజ్ అని పిలవాలి. లేకపోతే ఆయన పెద్దగా స్పందించరు. మన సమస్యలు పరిష్కరించరు. ఈ రకమైన కుటుంబ సాంప్రదాయాన్ని వారు అనుసరిస్తున్నారు. కానీ గ్వాలియర్, చంబా ప్రజలకు మాత్రం సింథియా ద్రోహం చేశారు.' అని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సింథియా కూడా కాంగ్రెస్‌పై ఇటీవల తీవ్రంగా ఆరోపణలు చేశారు. మహిళలకు ఆ పార్టీ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ రాజకీయాల్లో విఫలమయ్యారని విమర్శించారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పతనమైందని అన్నారు.
సింథియాపై ప్రియాంక గాంధీ ఆగ్రహం !
November 15, 2023
0
Tags