న్యూఢిల్లీలోని సంగ్లోయ్ మెట్రో స్టేషన్ లో అనిల్ కుమార్ (58) అనే వ్యక్తి చెకింగ్ పాయింట్ దాటిన తర్వాత ఆకస్మికంగా కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడే డ్యూటీలో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ ఉత్తమ్ కుమార్ వెంటనే స్పందించాడు. అనిల్‌కి కార్డియో పల్మనరీ రిససిటేషన్ అందించడం ద్వారా ప్రాణాలు కాపాడారు. సీపీఆర్ చేయడంతో వెంటనే ఆ ప్రయాణికుడు స్పహలోకి వచ్చాడు. దీంతో అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఐఎస్ఎఫ్ తన ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేసింది. అనిల్ కుమార్ అనే ప్రయాణికుడికి సీపీఆర్ అందించడం ద్వారా ఎంతో విలువైన ప్రాణాల్ని సిబ్బంది కాపాడారని, అతడు కృతజ్ఞతలు తెలిపారని పేర్కొంది.
మెట్రో స్టేషన్‌లో కుప్పకూలిన వ్యక్తికి సీపీఆర్ చేసి కాపాడిన జవాన్ !
November 05, 2023
0
Tags