వైద్యుల నిర్లక్ష్యంతో కడుపులోనే బిడ్డ మృతి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో కడుపులోనే శిశువు మృతి చెందింది. లోకేశ్వరం మండలం నగర్ గ్రామానికి చెందిన రజిత పురిటి నొప్పులతో నవంబర్ 19వ తేదీన ఉదయం 11 గంటలకు భైంసా ఆసుపత్రిలో చేరింది. నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పిన వైద్యులు సాయంత్రం వరకు వెయిట్ చేయాలని చెప్పారు. చివరకు రాత్రి 12గంటలకు నార్మల్ డెలివరీ చేయడంతో శిశువు మృతి చెందింది. ఆసుపత్రి సిబ్బందితోనే చికిత్సలు చేశారని, ఇప్పటి వరకు ఒక్క డాక్టర్ కూడా రజితను పరిశీలించలేదని కుటుంబీకుల ఆరోపిస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)