ప్రధాని నరేంద్ర మోడీ రేపు సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఎల్బీ స్టేడియం చేరుకొని బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు. 6.30 నిమిషాలకు బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. బీసీ సీఎం నినాదంతో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. బీసీలకు భరోసా ఇచ్చేలా ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభలో మాట్లాడతారని, బీసీలకు హామీలను ఇస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ సభను విజయవంతం చేయడం కోసం బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. బహిరంగ సభ కు జరుగుతున్న ఏర్పాట్లను బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చూగ్, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సభకు లక్ష మందిని తరలించాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి జనాలను తరలించడానికి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసింది.
రేపు హైదరాబాద్ కు ప్రధాని రాక !
November 06, 2023
0
Tags